: తాగి కారు డ్రైవ్ చేసిన గోల్ఫ్ సూపర్ స్టార్.. టైగర్ వుడ్స్ అరెస్ట్!


గోల్ఫ్ సూపర్ స్టార్ టైగర్ వుడ్స్ సోమవారం ఫ్లోరిడాలో అరెస్టయ్యాడు. మద్యం లేదంటే డ్రగ్ తీసుకుని వాహనం నడుపుతున్న అతడిని అరెస్ట్ చేసినట్టు అమెరికాలోని పామ్ బీచ్ కౌంటీ పోలీసులు తెలిపారు. అనంతరం అతడిని సొంత పూచీకత్తుపై విడిచిపెట్టారు. 14 సార్లు మేజర్ చాంపియన్ షిప్‌ను గెలుచుకున్న టైగర్ వుడ్స్‌ ప్రస్తుతానికి వెన్ను నొప్పి కారణంగా పోటీలకు దూరంగా ఉంటున్నాడు. వెన్ను నొప్పికి గత మూడేళ్లలో నాలుగుసార్లు శస్త్రచికిత్స చేయించుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్ 20న కూడా ఆపరేషన్ జరిగింది. కాగా, తాను ఆరోగ్యంగానే ఉన్నానని, భయపడాల్సిందేమీ లేదని ఇటీవల వుడ్స్ పేర్కొన్నాడు. తిరిగి ప్రొఫెషనల్ గోల్ఫ్‌లో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News