: సచిన్ సినిమా పారితోషికం 35 కోట్లు?


టీమిండియా క్రికెట్ దేవుడిగా నీరాజనాలందుకున్న దిగ్గజ ఆటగాడు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్‌- ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజైన రెండు రోజుల్లోనే 17 కోట్ల రూపాయలు రాబట్టి ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సచిన్ టెండూల్కర్ ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదని గతంలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసింది.

అయితే ఇప్పుడు అందుకు భిన్నంగా ఈ సినిమాకు సచిన్ 35 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నాడని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. కాగా, ‘సచిన్‌- ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమాకు నిర్మాతగా రవి భాగచంద్కా వ్యవహరించగా, హాలీవుడ్‌ దర్శకుడు జేమ్స్‌ ఎర్‌ స్కైన్‌ దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే, ఆమధ్య వచ్చిన తన బయోపిక్ కోసం ధోనీ 60 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడని వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News