: నేడు హైదరాబాదుతో పాటు దక్షిణ భారతంలోని హోటళ్లు బంద్!
నేడు హైదరాబాదుతో పాటు దక్షిణ భారతదేశంలోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడనున్నాయి. త్వరలో జీఎస్టీ అమలులోకి రానుండడంతో జీఎస్టీలో ఏ.సి. హోటళ్లలో 18 శాతం, నాన్ ఏ.సి. హోటళ్లలో 12 శాతం పన్ను విధించడాన్ని నిరసిస్తూ దక్షిణాది హోటళ్లు, రెస్టారెంట్ల అసోసియేషన్ బంద్ కు పిలుపునిచ్చింది. ప్రస్తుతం ఏపీలో 5 శాతం, తెలంగాణలో 2 శాతం పన్ను విధిస్తున్నాయి. ఇది ఒక్కసారిగా 18 శాతానికి పెంచడంతో హోటళ్లలో తినాలంటే వినియోగదారులు బెంబేలెత్తిపోతారని, తద్వారా తమ వ్యాపారాలు పూర్తిగా నష్టపోయే ప్రమాదం ఉందని చెబుతూ హోటల్, రెస్టారెంట్ అసోసియేషన్లు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో నేడు హైదరాబాదుతో పాటు, దక్షిణ భారత దేశంలోని మొత్తం హోటళ్లు బంద్ కానున్నాయి.