: మియాపూర్‌లో భవనం పై నుంచి దూకి ఆత్మహ‌త్య చేసుకున్న యువ‌కుడు


హైద‌రాబాద్‌ శివారు మియాపూర్‌లో ఈ రోజు మ‌ధ్యాహ్నం క‌ల‌క‌లం చెల‌రేగింది. జగదీశ్‌ (26) అనే ఓ యువ‌కుడు తాను ఉంటున్న‌ జనప్రియ ఫోర్త్‌ ఫేస్ బ్లాక్ బి అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకేశాడు. దీంతో ఆ యువకుడు తీవ్ర‌గాయాల‌తో మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు. అత‌డిది వరంగల్‌ జిల్లా డోర్నకల్‌ మండలం గొల్లచర్ల గ్రామ‌మ‌ని, అత‌డు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి గ‌ల కార‌ణాల గురించి తెలియాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు నమోదు చేసుకున్న‌ పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.              

  • Loading...

More Telugu News