: రజనీకాంత్ పార్టీ పెడితే ‘చిరంజీవి ప్రజారాజ్యం’లా మాత్రం కాకూడదు: జయప్రద
సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని ఊహాగానాలు ఊపందుకున్న వేళ సినీ నటీ జయప్రద ఆయనకు ఓ ఉచిత సలహా ఇస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం అంశాన్ని గుర్తు చేశారు. రజనీకాంత్ పార్టీ పెడితే చిరంజీవిలా మాత్రం చేయొద్దని ఆమె వ్యాఖ్యానించారు. చిరంజీవిలా రజనీకాంత్ వెనకడుగు వేయకూడదని అన్నారు. రజనీ పెట్టనున్న రాజకీయ పార్టీ మరో ప్రజారాజ్యం కావద్దని ఆమె అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాల్సి ఉందని, ఆయన పార్టీ పెడితే తప్పకుండా విజయవంతం అవుతారని ఆమె అన్నారు.