: మహిళను అతిదారుణంగా గొడ్డలితో నరికి చంపి.. రక్తపు మడుగులో ఉన్న ఆమెతో సెల్ఫీ వీడియో తీశాడు!


పంజాబ్‌ లూధియానాలోని కిలా రాయ్‌పూర్‌ గ్రామంలో ఓ యువ‌కుడు న‌డిరోడ్డుపై దారుణ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ్డాడు. సరబ్‌జీత్‌ కౌర్‌ అనే మహిళ రోడ్డుపై నుంచి నడుచుకుంటూ వెళ్తుండగా మణిందర్‌సింగ్ అనే యువ‌కుడు ఆమెపై గొడ్డ‌లితో దాడి చేశాడు. అనంత‌రం తీవ్ర‌గాయాల‌తో రక్తపు మడుగులో ప‌డి ఉన్న ఆమె పక్కనే నిల్చుని సెల్ఫీ వీడియో తీశాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు కొన‌సాగిస్తున్నారు.

మణిందర్‌సింగ్ త‌మ‌ గ్రామంలోని ఓ మహిళతో వివాహేత‌ర‌ సంబంధం పెట్టుకున్నాడని, ఈ విషయాన్ని సరబ్‌జీత్‌ కౌర్ గుర్తించింద‌ని, అప్ప‌టి నుంచి అతడిని బ్లాక్‌మెయిల్ చేస్తోంద‌ని పోలీసులు తెలిపారు. అందుకే ఆమెపై ప‌గ పెంచుకున్న మణింద‌ర్ సింగ్ ఆమెను గొడ్డ‌లితో న‌రికి చంపేశాడ‌ని తెలిపారు. హ‌త్య చేసిన తర్వాత హంతకుడు తనే స్వయంగా తమకు ఫోన్‌ చేసి చెప్పాడ‌ని వివ‌రించారు.

  • Loading...

More Telugu News