: తానా ఉత్సవాల్లో సందడి చేసిన హీరో కల్యాణ్ రామ్


సినీ హీరో కల్యాణ్ రామ్ అమెరికాలో జరుగుతున్న తానా వేడుకల్లో సందడి చేశాడు. తానా సభ జరుగుతున్న ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన దివంగత ఎన్టీఆర్ నటనా వైభవానికి సంబంధించిన ఎగ్జిబిషన్ ను ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ తెలుగు మీడియా ఛానల్ తో ఆయన మాట్లాడుతూ, తనను ఈ వేడుకకు నిర్వాహకులు ఆహ్వానించడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నానో ఆ మహానుభావుడి మనవడిగా పుట్టానని తెలిపారు. ఇంత మంది తెలుగువారు ఇక్కడ ఒకే చోట చేరడం సంతోషంగా ఉందని చెప్పాడు. మన సంప్రదాయాలు, సంస్కృతులను కాపాడుకుంటూ... తర్వాత తరాలకు కూడా అందిస్తున్న తల్లిదండ్రులందరికీ హ్యాట్సాఫ్ అని అన్నాడు. మంచి స్క్రిప్ట్ దొరికితే చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాను సొంత బ్యానర్ లో నిర్మించడం గురించి ఆలోచిస్తామని చెప్పాడు. 

  • Loading...

More Telugu News