: సైనా నెహ్వాల్, హీరో అక్షయ్ కుమార్ లకు మావోయిస్టుల కౌంటర్!


బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ లకు మావోయిస్టులు కౌంటర్ ఇచ్చారు. తమ దాడిలో మృతి చెందిన సీఆర్ఫీఎఫ్ కుటుంబాలకు వీరు ఆర్థిక సాయం చేయడంపై మావోలు మండిపడ్డారు. సినీ నటులు, క్రీడాకారులు, ప్రముఖులు పేదల పక్షాన నిలబడాలని... మానవ హక్కుల ఉల్లంఘనలకు, పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా గళమెత్తాలని అన్నారు.

ఛత్తీస్ గఢ్ సుక్మా జిల్లాలో మార్చి నెలలో మావోలు జరిపిన ఆకస్మిక దాడిలో 27 మంది సీర్పీఎఫ్ జవాన్లు హతమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల కుటుంబాలకు రూ. 9 లక్షల చొప్పున అక్షయ్ కుమార్ సాయం చేశాడు. రూ. 50 వేల చొప్పున సాయం అందిస్తానని తన 27వ పుట్టిన రోజు నాడు సైనా తెలిపింది.  

  • Loading...

More Telugu News