: అలా జరిగితే నేను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌


వచ్చే ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ పార్టీ తిరుగులేని మెజారిటీతో గెలుస్తుంద‌ని తాము చేయించిన స‌ర్వే ద్వారా తెలిసింద‌ని సీఎం కేసీఆర్ అన్న వ్యాఖ్య‌ల‌పై కాంగ్రెస్ నేత‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విరుచుకుప‌డ్డారు. ఆ పార్టీ చేయించిన‌ సర్వే ఓ పెద్ద జోక్‌ అని కొట్టిపారేశారు. ఈ రోజు క‌రీంన‌గ‌ర్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ... ఆ సర్వేలో మాజీ డిప్యూటీ సీఎం టి.రాజయ్యకు 4వ ర్యాంక్ వ‌చ్చింద‌ని, మ‌రి ఆ ప‌దవిని ఆయ‌న‌కు తిరిగి ఇస్తారా? అని పొన్నం ప్ర‌భాక‌ర్ నిల‌దీశారు. టీఆర్ఎస్ పార్టీలో సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్లు ఇస్తామ‌ని చెప్పుకుంటున్నార‌ని తెలిపిన ప్ర‌భాక‌ర్‌.. ఒకవేళ అదే కనుక నిజమైతే తాను వ‌చ్చే ఎన్నికల్లో పోటీ చేయబోనని స‌వాలు విసిరారు. రానున్న‌ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీయే విజ‌యం సాధిస్తుంద‌ని పొన్నం ధీమాగా చెప్పారు.      

  • Loading...

More Telugu News