: 'పాకీజా' నటి గీతా కపూర్ ను నిర్దయగా ఆసుపత్రిలో పడేసి మాయమైన కుమారుడు... స్పందించని కుమార్తె!


సూపర్ హిట్ హిందీ చిత్రం 'పాకీజా' నటి గీతా కపూర్, ఇప్పుడు ఓ ఆసుపత్రిలో అనాధలా మిగిలారు. ఏప్రిల్ 21న ఆమె రక్తపోటుతో బాధపడుతుండగా, స్వయంగా ఆసుపత్రికి తీసుకువచ్చిన ఆమె కుమారుడు రాజా కపూర్, డబ్బులు తీసుకు వస్తానని చెప్పి బయటకు వెళ్లి, అప్పటి నుంచి రాకపోగా, ఆమె నేపథ్యం, దీనస్థితికి జాలిపడ్డ ఆసుపత్రి వైద్యులు వైద్యం కొనసాగిస్తున్నారు.

ఎస్ఆర్వీ ఆసుపత్రిలో ఆమె చేరగా, చికిత్స కోసం కొంత డబ్బు డిపాజిట్ చేయాలని ఆసుపత్రి నిర్వాహకులు సూచించడంతో, ఏటీఎం వరకూ వెళ్లి వస్తానని చెప్పిన రాజా, ఆపై తిరిగి రాలేదు. ఇక కొడుకు తనపై ఎంతో నిర్దయగా ప్రవర్తిస్తుండే వాడని, ఓ గదిలో బంధించి, నాలుగు రోజులకు ఒకసారి మాత్రమే ఆహారం పెట్టేవాడని ఆమె ఆరోపించారు. కాగా, ఆమెను బయటకు పంపలేని స్థితిలో ఉన్న ఆసుపత్రి వైద్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, గీత కుటుంబ సభ్యుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. గీత కుమార్తె పూజకు పోలీసులు ఫోన్ చేయగా, ఆమె రాంగ్ నంబర్ అంటూ ఫోన్ పెట్టేసినట్టు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News