: పాకిస్థాన్ తో ఇప్పట్లో క్రికెట్ ఆడే ప్రశ్నే లేదు: క్రీడల మంత్రి
టీమిండియా ద్వైపాక్షిక సిరీస్ ఆడడం కోసం ఐసీసీని అడ్డం పెట్టుకుని పాక్ ఎన్నో ఎత్తులు వేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర క్రీడల మంత్రి విజయ్ గోయల్ ను పాక్ తో ద్వైపాక్షిక సిరీస్ పై మీడియా ప్రశ్నించగా, ఇప్పుడున్న పరిస్థితుల్లో పాకిస్థాన్ తో ద్వైపాక్షిక సిరీస్ ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పాకిస్థాన్ నుంచి ఉగ్ర దాడులు ఆగేవరకు క్రికెట్ మాట ఎత్తే ప్రశ్నే లేదని ఆయన స్పష్టం చేశారు. పీసీబీకి ఏదైనా హామీ ఇచ్చేముందు తమతో మాట్లాడాలని బీసీసీఐకి చెప్పామని ఆయన అన్నారు. పాక్ తో క్రీడా సంబంధాలను కొనసాగించేందుకు తాను వ్యతిరేకం కాదని తెలిపిన ఆయన, ముందు పాక్ తీరు మారాల్సి ఉందని ఆయన చెప్పారు.
India Pakistan can't play bilateral series till the terror from Pakistan remains: Union Minister Vijay Goel on BCCI-PCB meet in Dubai. pic.twitter.com/blkHNFT8rW
— ANI (@ANI_news) May 29, 2017