: ముస్లింలు, దళితులు, జైనులు... ఎవరైనా భారత్ లో రక్షణ లేదనుకుంటే ఇలా చేయండి!: వైరల్ అయిన రణదీప్ హుడా ట్వీట్


బాలీవుడ్ నటుడు రణదీప్ హుడా తన ఫేస్ బుక్ పేజీలో ఓ ఆసక్తికరమైన పోస్టును పెట్టగా అదిప్పుడు వైరల్ అయింది. సమాజంలోని వివిధ వర్గాల ప్రజల్లో నెలకొన్న ఆందోళనను తెలుపుతూ, దాన్ని దూరం చేసేందుకు ఆయనో సలహా ఇచ్చాడు. ఇంతకీ ఆయన పెట్టిన పోస్టు ఏంటంటే...

"మీరు ముస్లిం అయివుండి, వేల సంవత్సరాలుగా ఉంటున్న దేశంలో ఇప్పుడు రక్షణ లేదని భావిస్తున్నట్లయితే...
మీరు దళితులై ఉండి, జీవితంలోని ప్రతి క్షణమూ అవమానాలను ఎదుర్కొంటున్నామని భావిస్తే...
మీరు హిందువై ఉండి, దేశంలో అడుగడుగునా ఆవులను చంపుతున్నారని అనుకుంటూ ఉంటే...
మీరు జైనులై ఉండి, మతాచారాలను పాటించడంలో సర్దుకుపోవాల్సి వస్తోందని అనుకుంటూ ఉంటే...
మీరు పంజాబీలై ఉండి, యువత అంతా మాదక ద్రవ్యాలకు బానిసలుగా మారిపోయారని ఆలోచిస్తూ ఉంటే...
ఓ పని చేయండి...

- సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉండండి.
- వార్తలను అసలు చూడవద్దు.
- మతపరమైన చర్చా కార్యక్రమాలకు వెళ్లవద్దు.
- మీ చుట్టు పక్కల ఉన్న వివిధ మతాలు, కులాలకు చెందిన ప్రజలను ఒక్కసారి చూడండి.
మీకు అప్పుడు తెలుస్తుంది. ప్రపంచంలోనే అత్యుత్తమ దేశంలో మీరు నివసిస్తున్నారని"
రణదీప్ పెట్టిన ఈ పోస్టును ఫేస్ బుక్ లో 16 వేల మందికి పైగా షేర్ చేసుకోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News