: మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టి... కలకలం రేపిన పరకాల ప్రభాకర్!
విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో ఏపీ ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ కలకలం రేపారు. వివరాల్లోకి వెళ్తే, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలంటూ మహానాడులో ప్రభాకర్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో, టీడీపీ నేతలు అవాక్కయ్యారు. టీడీపీ సభ్యుడిగా ఆయన ఉన్నట్టు దాఖలాలు లేవు. అయితే, దీనిపై చంద్రబాబు మహానాడు వేదికపై స్పందించి, వివరణ ఇచ్చారు. ఈ తీర్మానాన్ని ప్రభాకర్ ప్రవేశపెట్టడంలో తప్పేమీ లేదని... ఆయన ప్రభుత్వ సలహాదారు అని, రాజకీయ పరంగానే అతని పదవీ నియామకం జరిగిందని చెప్పారు.