: మా నాన్న గారితో నాకు గొడవ రాజేసిన దొంగబ్బాయి...!: జగన్ పై నిప్పులు చెరిగిన లోకేష్


తన తండ్రి నారా చంద్రబాబునాయుడుకి, తనకు మధ్య దొంగబ్బాయి చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాడని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. విశాఖపట్టణంలో జరుగుతున్న మహానాడులో ఆయన మాట్లాడుతూ, గతంలో ఒక సెమినార్ కు మెడనొప్పి కారణంగా రెండు రోజుల తరువాత వెళ్లానని, దీంతో సెమినార్ లో పాల్గొనేందుకు తన తండ్రితో కలిసి వెళ్తున్న సమయంలో... తన తండ్రితో తనకు వివాదం ఉందని సొంత టీవీ ఛానెల్లో బ్రేకింగ్ వేశాడని ఆయన జగన్ పై ఆరోపించారు.

'ఇది ఎంత అన్యాయమండీ!' అని ఆయన సభికులనుద్దేశించి లోకేశ్ అన్నారు. సొంత తండ్రితోనే విభేదాలు ఉన్నాయని పుకార్లు పుట్టించిన దొంగబ్బాయి.. ఇక కార్యకర్తల మధ్య ఎలాంటి వివాదాలు రాజేస్తాడో ఊహించుకోవాలని ఆయన సూచించారు. దొంగబ్బాయి గోదావరి జిల్లాలకు వచ్చి నీరంతా రాయలసీమకు తీసుకెళ్లిపోతున్నారని అంటాడని, రాయలసీమకు వెళ్లి నీరంతా గోదావరి జిల్లాల వారే వాడుకుంటున్నారని విమర్శలు చేస్తాడని ఆయన మండిపడ్డారు.

  • Loading...

More Telugu News