: వీడియో తీస్తూ అత్యాచారం.. ఆపై బెదిరింపులు
విద్యార్థులు విద్యనైతే నేర్చుకుంటున్నారు గానీ చక్కని నడత నేర్చుకోవడంలో తప్పటడుగులు వేస్తున్నారు. నేరాలు, అత్యాచారాల కేసులలో ఇటీవల విద్యార్థులు పట్టుబడుతుండడమే ఇందుకు ఉదాహరణ. తాజాగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో నలుగురు ఇంజనీరింగ్ విద్యార్థులు డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం చేయడమే కాకుండా వీడియోతీసి బెదిరింపులకు కూడా పాల్పడ్డ ఘోరం వెలుగు చూసింది. తమ నీచ కార్యాన్ని వీడియో తీసి నేరుగా ఆమె తల్లిదండ్రులనే బెదిరించారు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఆ నలుగురు నీచ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు.