: టీడీపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడే!


తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక నేడు జరగబోతోంది. విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడులో చివరిరోజైన నేడు పార్టీ అధినేత చంద్రబాబును రెండోసారి జాతీయ అధ్యక్షుడిగా ఎన్నుకోనున్నారు. నిన్న మధ్యాహ్నం జాతీయ అధ్యక్ష పదవికి నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ క్రమంలో ఏపీ, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవుల నుంచి మొత్తం 33 నామినేషన్లు వచ్చాయి. ఇవన్నీ కూడా చంద్రబాబుకు అనుకూలంగానే దాఖలయ్యాయి. మరోవైపు, అత్యంత కీలకమైన ఓ రాజకీయ తీర్మానాన్ని కూడా నేడు ప్రవేశపెట్టనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News