: మహానాడుకు హాజరైన వైసీపీకి చెందిన ఉప సర్పంచ్!
విశాఖపట్నంలో జరుగుతున్న టీడీపీ మహానాడుకు వైసీపీ నేత ఇళయరాజా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇతను చిత్తూరు జిల్లా కుప్పం మండలం అనిమాగానిపల్లె ఉప సర్పంచ్ గా వ్యవహరిస్తున్నాడు. వైసీపీలో క్రియాశీలకంగా వ్యవహరించే ఇళయరాజా ఎంపీటీసీ అభ్యర్థిగా, సర్పంచ్ గా పోటీ చేసి, ఉప సర్పంచ్ గా ఎన్నికయ్యాడు. మహానాడులో ఆయన కనిపించడం వైసీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇళయరాజా టీడీపీలో చేరబోతున్నట్టు చెప్పుకుంటున్నారు.