: కాపులకు రిజర్వేషన్లు ఇస్తాం: చంద్రబాబు కీలక ప్రకటన
కాపులకు రిజర్వేషన్లు కల్పించి, తమ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని నెరవేర్చి చూపిస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. మహానాడు మూడో రోజు తనను కలిసిన కాపు నేతలతో మాట్లాడిన ఆయన, కాపులకు రిజర్వేషన్లపై ఓ కమిటీని వేశామని, కమిటీ నివేదిక రాగానే రిజర్వేషన్లపై ప్రకటిస్తామని తెలిపారు. కాపు సామాజిక వర్గం కేవలం విద్య, ఉద్యోగాల్లోనే రిజర్వేషన్లు కోరుతోందని, రాజకీయాల్లో కోరలేదని గుర్తు చేసిన ఆయన, జనాభా లెక్కల గణన పరిశీలన తరువాత వారికి రిజర్వేషన్లు దగ్గరవుతాయని చెప్పారు. తమకు రిజర్వేషన్లు కావాలని ఏ కాపునేతా ఉద్యమించక్కర్లేదని, ఈ విషయంలో తాను పూర్తి నిబద్ధతతో ఉన్నానని వెల్లడించారు.