: లండన్ లో లేడీ పోలీసుతో కోహ్లీ ముచ్చట్లు!
విధినిర్వహణలో ఉన్న ఓ లేడీ పోలీసుతో టీమిండియా కెప్టెన్ కోహ్లీ నవ్వుతూ మాట్లాడుతున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫొటోను బీసీసీఐ పోస్ట్ చేసింది. నిన్న లండన్ లో న్యూజిలాండ్ తో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ కు ముందు ఆమెను కోహ్లీ పలకరించి, ముచ్చటించాడు. గతవారం మాంచెస్టర్ లో జరిగిన ఉగ్రదాడిలో 22 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో, బ్రిటన్ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనపై కోహ్లీ కూడా స్పందించాడు. ఉగ్రదాడిని తాను పూర్తిగా ఖండిస్తున్నట్టు చెప్పాడు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోవడం, గాయపడటం తనను చాలా బాధించిందని చెప్పాడు.