: ట్రంప్, మోదీ.. దొందూ దొందే: ప్రకాశ్ కారత్
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఏమాత్రం తేడా లేదని సీపీఎం పొటిట్ బ్యూరో సభ్యుడు ప్రకాశ్ కారత్ అన్నారు. ఇతర దేశాలవారిపై ట్రంప్ దారుణంగా వ్యవహరిస్తుంటే... ముస్లింలపై మోదీ దురుసుగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. మేకిన్ ఇండియా ద్వారా దేశంలో ఎక్కడ అభివృద్ధి జరుగుతుందో బీజేపీ నేతలు చెప్పాలని కారత్ డిమాండ్ చేశారు. దేశంలో వ్యవసాయం సంక్షోభంలో చిక్కుకుందని... రైతుల బతుకులు నాశనం అయిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు మోదీని కార్పొరేట్ సంస్థలు భుజాన మోశాయని... ఇప్పుడు ఆ కంపెనీలకు మాత్రమే మోదీ మేలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జంతువధపై దేశవ్యాప్తంగా నిషేధం విధించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందువులు కూడా గోమాంసాన్ని భుజిస్తారని... కేవలం పూజించడానికే ఆవులు అంటే, బతకడం ఎలా? అని ప్రశ్నించారు.