: మిస్టరీగా మారిన చెన్నై మోడల్ మిస్సింగ్!


చెన్నైకు చెందిన మోడల్, స్క్రీన్ ప్లే రైటర్ గానమ్ నాయర్ (28) మిస్సింగ్ వ్యవహారం మిస్టరీగా మారింది. ఆమె అదృశ్యమై నాలుగు రోజులైనా ఆచూకీ దొరకకపోవడంతో... ఆమె కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 26 నుంచి ఆమె కనిపించడం లేదు. విరుగంబక్కమ్ లోని ఫ్రెండ్ ఇంటికి వెళుతున్నానని, కాసేపట్లోనే తిరిగి వచ్చేస్తానని చెప్పి, ఇంటి నుంచి వెళ్లిన ఆమె ఇంతవరకు రాలేదు. దీనిపై చెన్నైలోని కేకే నగర్ పోలీస్ స్టేషన్ లో ఆమె బంధువులు ఫిర్యాదు చేశారు. ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయినట్టు పోలీసులు తెలిపారు. విరుగంబక్కమ్ నుంచి నన్ గంబక్కమ్ కు ఆమె వెళ్లినట్టు దర్యాప్తులో తేలింది. ఆమె ఫోన్ కాల్స్ రికార్డులను పరిశీలిస్తున్నామని... ఆమె స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. 

  • Loading...

More Telugu News