: 'బాహుబలి' కోసం గుత్తిలో వీరంగమాడిన మందుబాబులు!


తమ కోసం బాహుబలి 2 చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలంటూ కొందరు మందుబాబులు అనంతపురం జిల్లా గుత్తిలో వీరంగమాడారు. ఈ విషయంలో కేసు నమోదు చేసిన పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, పట్టణంలోని కేపీఎస్ మూవీల్యాండ్ థియేటరు వద్దకు గత అర్ధరాత్రి పూటుగా మద్యం తాగి వచ్చిన కొందరు, ప్రత్యేక షో కోసం పట్టుబట్టారు. ఇందుకు థియేటర్ సిబ్బంది నిరాకరించడంతో ఆగ్రహంతో వారిపై దాడికి దిగారు. ఈ ఘటనలో థియేటర్ సిబ్బందికి గాయాలయ్యాయి. థియేటర్ లోని ఫర్నీచర్ కూడా ధ్వంసమైంది. మందుబాబుల దాడి దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. థియేటర్ సిబ్బంది ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ఈ వీడియోలను క్షుణ్ణంగా పరిశీలించి నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.

  • Loading...

More Telugu News