: తగ్గని కిమ్... అణ్వాయుధాలను అమెరికాకు మోసుకెళ్లే క్షిపణి పరీక్ష


అగ్రరాజ్యాలు ఎంతగా వారిస్తున్నా వినని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ మరోసారి క్షిపణి పరీక్ష చేపట్టి విజయవంతమయ్యారు. అమెరికాకు అణ్వాయుధాలను మోసుకెళ్లడమే లక్ష్యంగా కిమ్ తయారు చేయించిన క్షిపణిని నేడు ప్రయోగించారు. తూర్పు తీర నగరం వోన్సన్ కు సమీపంలోని ఓ రహస్య ప్రాంతం నుంచి దీన్ని వదలగా, జపాన్ సముద్ర జలాల్లో ఇది పడింది. ఈ క్షిపణి మరో 500 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తే, అది అమెరికాకు చేరుకునే శక్తిని పొందినట్టేనని కొరియా అధికారి ఒకరు ప్రకటించినట్టు తెలుస్తోంది. ఈ ప్రయోగాన్ని కిమ్ దగ్గరుండి పరిశీలించినట్టు సమాచారం. మరోవైపు ఉత్తర కొరియా తీరుపై అమెరికా, జపాన్, దక్షిణ కొరియాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి.

  • Loading...

More Telugu News