: 'ఇప్పటికీ చాక్లెట్లు దొంగిలిస్తుంటా'నంటున్న వివేక్ ఒబెరాయ్!
'రక్తచరిత్ర' సినిమాలో నటించిన బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్, చిన్నప్పుడు తాను చాక్లెట్లు దొంగతనం చేసేవాడినని చెప్పాడు. తనకు చాక్లెట్లంటే చాలా ఇష్టమని, తనకు దొరకకుండా దాచేస్తే కనుక వాటిని దొంగిలించే వాడినని చెప్పాడు. తాజాగా ‘బ్యాంక్ చోర్’ సినిమాలో పోలీస్ అధికారిగా నటించిన వివేక్ ఒబెరాయ్ ఆ సినిమా ప్రమోషన్ లో మాట్లాడుతూ, తాను చాక్లెట్లు తినకుండా తన భార్య కట్టడి చేస్తుందని అన్నాడు. తన పిల్లలకు కొనే చాక్లెట్లు తన కంటబడకుండా దాచేస్తుందని అన్నాడు. అప్పుడప్పుడు వాటిని దొంగిలించి దొరికిపోతుంటానని అన్నాడు. ఈ విషయంలో తన స్నేహితులు తనను ఆటపట్టిస్తుంటారని అన్నాడు. చాక్లెట్లంటే చిన్నప్పటి నుంచి తనకు చాలా ఇష్టమని చెప్పాడు. కాగా, ఈ సినిమా జూన్ 16న విడుదలకానుంది.