: హైదరాబాదులోని కూకట్ పల్లిలో 10,000 కోట్ల భూకుంభకోణం వివరాలివే...!
హైదరాబాదులోని కూకట్ పల్లి పరిధిలో పది వేల కోట్ల రూపాయల విలువైన భూ కుంభకోణాన్ని అధికారులు గుర్తించారు. మియాపూర్ లో 692 ఎకరాల భూమి అక్రమ రిజిస్ట్రేషన్ జరిగినట్టు అధికారులు గుర్తించారు. మియాపూర్ లోని సర్వే నెంబర్ 100 లో 207 ఎకరాలు, సర్వే నెంబర్ 101లో 231 ఎకరాలు, సర్వే నెంబర్ 20లో 109 ఎకరాలు, సర్వే నెంబర్ 28లో 145 ఎకరాలు ఇలా పది వేల కోట్ల రూపాయల విలువైన 692 ఎకరాలను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు గుర్తించారు. ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టినట్టు అధికారులు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఈ అక్రమ దందాకు తెరతీసిన సబ్ రిజిస్ట్రార్ శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కుంభకోణంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.