: 'బాహుబలి' ప్రభాస్ పెళ్లి ముహూర్తం కుదిరిందా?... సోషల్ మీడియాలో వైరల్ న్యూస్
'బాహుబలి' ప్రభాస్ పెళ్లి ముహూర్తం కుదిరిందా? అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ అయిన ప్రభాస్ కు వివాహం చేసేందుకు అతని కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారంటూ గతంలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. ఈ మేరకు ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు ఈ ఏడాది సెప్టెంబర్–నవంబర్ నెలల్లో మంచి ముహూర్తాలు ఉంటే చూడమని పురోహితులను అడిగారనే ఒక వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది.
దీంతో ప్రభాస్ జాతకం, పెళ్లి ముహూర్తం తదితరాల గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రభాస్ జాతకం ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి అతని పర్సనల్ లైఫ్ లో మరిన్ని మంచిరోజులు వస్తాయట. 2018 తొలి ప్రథమార్థంలో ప్రభాస్ కచ్చితంగా ఒక ఇంటివాడు అవుతాడట. వచ్చే ఏడాది మార్చినాటికి ప్రభాస్ పెళ్లి ఘడియలు ప్రారంభమవుతాయని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.