: అలాంటి చోటుకి మహిళలు వెళ్లకూడదు: అజంఖాన్
ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లో 14 మంది బాలురు ఇద్దరు మహిళలను వేధించిన ఓ వీడియో కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై సమాజ్‌వాదీ పార్టీ నేత అజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన జరగడంలో వింత ఏముందని ఆయన అన్నారు. సీఎం యోగి హయాంలో కూడా యూపీలో ఎన్నో హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయని అన్నారు. ఎక్కడ సిగ్గులేని నగ్ననృత్యాలు జరుగుతుంటాయో అక్కడకు మహిళలు వెళ్లకూడదని హితవు పలికారు. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు మీడియా నిర్లక్ష్యం వల్లే నేరాలు పెరిగిపోతున్నాయని అన్నారు.