: ఇదో వింత: రైల్వే స్టేషన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న మహిళ!
ఇటీవలే ఓ విద్యార్థిని తన డిగ్రీ పట్టాని పెళ్లి చేసుకొని అంతర్జాతీయంగా వార్తల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. తాజాగా అమెరికాలోని ఓ మహిళ విచిత్రంగా ఓ రైల్వేస్టేషన్‌ని పెళ్లిచేసుకుని హాట్ టాపిక్‌గా మారింది. కాలిఫోర్నియాలోని శాంటా ఫే అనే రైల్వే స్టేషన్‌ను వివాహం చేసుకున్న ఆమె.. ప్రతిరోజు ఆ రైల్వేస్టేషన్‌కు వచ్చి 45 నిమిషాలు అక్కడే ఉంటోంది. తాను ఆ రైల్వేస్టేషన్‌ను 36 సంవత్సరాలుగా ప్రేమిస్తున్నానని తెలిపింది కారోల్ శాంటా ఫే (45) అనే ఆ మహిళ.
ఈ రైల్వే స్టేషన్‌ను ఆమె 2015లోనే పెళ్లి చేసుకుంది. తమ పెళ్లి జరిగి సంవత్సరం పూర్తయిన సందర్భంగా గత ఏడాది పెద్ద పార్టీ కూడా చేసుకుంది. ఆ రైల్వేస్టేషన్‌ను పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తాను దానితో మానసిక శృంగారంలో పాల్గొంటున్నానని ఆమె అంటోంది. ఇటీవల ఓ జర్నలిస్టుకు ఆమె ఈ సంగతి తెలపడంతో ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఆ మహిళ ప్రతి రోజు రైల్వే స్టేషన్‌కు వచ్చి, దానిని గట్టిగా హగ్ చేసుకొని ముద్దులు పెట్టుకుంటోంది. ఈ చోద్యాన్ని చూస్తున్న జనం మాత్రం 'ఒక్కొక్కళ్లదీ ఒక్కొ పిచ్చి' అంటూ నవ్వుకుంటున్నారు.