: వామ్మో... ఈ కారు ధర రూ.84 కోట్లు!


ల‌గ్జ‌రీ కార్ల త‌యారీ సంస్థ రోల్స్ రాయ్స్‌.. స్వెప్‌టెయిల్ పేరుతో ప‌్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కారును త‌యారు చేసింది. ఈ కారుని ఓ క‌స్ట‌మ‌ర్ కోసం ఆ కంపెనీ ప్ర‌త్యేకంగా త‌యారు చేసింది. 1920, 30ల్లో ఉన్న రోల్స్ రాయ్స్ కార్ల‌ను ప్రేర‌ణ‌గా తీసుకున్న ఓ క‌స్ట‌మ‌ర్‌ ఓ కొత్త డిజైన్‌ను కంపెనీకి ఇచ్చి, ఈ కారును త‌యారు చేయించుకున్నాడు. ఈ కారు ధ‌ర రూ.84 కోట్లు. అయితే, ఆ క‌స్ట‌మ‌ర్ అడిగిన ఫీచ‌ర్ల‌న్నింటితో ఈ కారును త‌యారుచేసిన‌ప్ప‌టికీ స‌ద‌రు క‌స్ట‌మ‌ర్ ఈ కారు ప‌ట్ల కాస్త అసంతృప్తి క‌న‌బ‌ర్చాడ‌ట‌. మొత్తానికి ఈ కారు ప్ర‌పంచంలోనే అత్యంత ఖ‌రీదైన కారుగా నిలిచింది.                                              



  • Loading...

More Telugu News