: బస్సులో డ్యాన్స్ చేసిన విరాట్ కోహ్లీ, శిఖర్ ధావన్.. మీరూ చూడండి!
వచ్చే గురువారం నుంచి ప్రారంభం కానున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొనేందుకు టీమిండియా ఇప్పటికే ఇంగ్లండ్ చేరుకున్న విషయం తెలిసిందే. టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్‌కు బస్సులో బయలుదేరగా, అందులో కెప్టెన్ విరాట్ కోహ్లీ , ఓపెనర్ శిఖర్ ధావన్ తమ సీట్లలో కూర్చొని హుషారుగా డ్యాన్సు చేశారు. బస్సులో భాంగ్రా పాట పెట్టుకున్న క్రికెటర్లు ఆ సాంగ్‌ను వింటూ ఇలా డ్యాన్స్ చేశారు. గ్రౌండ్ కు వెళుతున్న సమయంలో తాము బస్సులో ఈ విధంగా ఎంజాయ్ చేశామంటూ శిఖర్ ధావన్ తన ఫేస్‌బుక్‌లో ఈ వీడియోను పోస్ట్ చేశాడు. కాగా, గురువారం ప్రారంభం కానున్న ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో మొదటి మ్యాచ్ ఇంగ్లండ్, బంగ్లాదేశ్ టీమ్‌ల మధ్య జరగనుండగా, వచ్చే నెల 4న టీమిండియా.. పాకిస్థాన్‌తో తలపడనుంది.