: రక్తదానం చేసిన ఏపీ మంత్రి నారా లోకేశ్


విశాఖపట్నంలో నిర్వహిస్తున్న టీడీపీ మహానాడు కార్యక్రమం రెండవ రోజు కొనసాగుతోంది. మహానాడు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో టీడీపీ కార్యకర్తలు, నేతలు రక్తదానం చేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం రక్తదాన శిబిరాన్ని సందర్శించిన రాష్ట్ర మంత్రి లోకేశ్.. అక్కడ ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్ర‌హానికి నివాళులర్పించారు. అనంత‌రం ఆయ‌న ర‌క్తదానం చేశారు. ప్ర‌స్తుతం మ‌హానాడులో మాన‌వ వన‌రుల అభివృద్ధి, ఆరోగ్యం, విజ్ఞాన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌పై ప్రవేశ‌పెట్టిన తీర్మానాలపై ప్ర‌సంగం కొన‌సాగుతోంది. అంతకు ముందు ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలన్న తీర్మానంపై నేతలు ప్రసంగించారు.            

  • Loading...

More Telugu News