: బ్రిటన్‌లో 23 వేల మంది అనుమానిత ఉగ్రవాదులు: నిఘా వర్గాల అంచనా


ఇటీవ‌లే మాంచెస్ట‌ర్‌లో ఉగ్ర‌వాదులు దాడులు చేయ‌డంతో ఒక్కసారిగా బ్రిట‌న్ ఉలిక్కిప‌డిన విష‌యం తెలిసిందే. కాగా, బ్రిటన్‌లో ఏకంగా 23వేల మంది అనుమానిత ఉగ్రవాదులు ఉన్నట్లు అక్కడి నిఘా వర్గాలు అనుమానం వ్య‌క్తం చేస్తున్నాయి. వారంతా వివిధ రూపాల్లో సంచ‌రిస్తున్న‌ట్లు అంచ‌నా వేశారు. పాప్‌ సింగర్‌ అరియానా గ్రాండే మాంచెస్టర్‌లో సంగీత కార్య‌క్ర‌మం నిర్వహిస్తుండగా జ‌రిగిన ఉగ్ర‌దాడిలో 22 మంది మృతి చెందిన ఘ‌ట‌న‌లో విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు.. దక్షిణ మాంచెస్టర్‌లో మొత్తం న‌లుగురిని అరెస్టు చేశారు. వారి నుంచి అధికారులు ప‌లు వివ‌రాలు సేకరించిన‌ట్లు తెలుస్తోంది. నిఘా వర్గాలు అంచనా వేస్తున్న 23 వేలమంది అనుమానిత ఉగ్రవాదుల్లో మూడు వేల మంది ఎంతో ప్రమాదకరమైన వారుగా పోలీసులు చెబుతున్నారు. పోలీసులు నిర్వహించిన 500 ఆపరేషన్లలో దొరికిన వారిలోనూ వారు ఉన్నారని స‌మాచారం.         

  • Loading...

More Telugu News