: బుల్లితెర నటి శ్వేతా తివారి చనిపోయిందంటూ సోషల్‌మీడియాలో పుకార్లు!
'బిగ్ బాస్' షో విన్నర్, ప్రముఖ బుల్లితెర నటి శ్వేతా తివారి మృతి చెందిందంటూ సోషల్ మీడియాలో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. చివరికి ఆమె భర్త కూడా కంగారు పడిపోయి షూటింగ్ నుంచి ఇంటికి వెళ్లిపోయారు. ఈ పోస్టు మొదటగా శ్వేత స్నేహితురాలు, ప్రముఖ నటి సాక్షి తన్వర్ తన ట్విటర్ ఖాతాలో చేసినట్లు తెలుస్తోంది. శ్వేతని కోల్పోయినందుకు బాధగా ఉందని ఆమె తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేయడంతో ఆమెకు అభిమానులంతా నివాళులు అర్పిస్తూ 'రెస్ట్ ఇన్ పీస్' అంటూ ట్వీట్లు చేశారు. కొందరు శ్వేతా భర్త అభినవ్‌కి ఫోన్లు చేసి మీ ఆవిడ చనిపోయినందుకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని అన్నారు. దీంతో షాక్‌కు గురైన అభినవ్ షూటింగ్ మధ్యలో ఆపేసి వెంటనే ఇంటికి వెళ్లిపోయారు. తన భార్య హ్యాపీగానే ఉందని అనంతరం ఆయన ట్వీట్ చేశాడు. ఇటువంటి పుకార్లు సృష్టించకూడదని అన్నారు.