: ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానసిక క్షోభకు గురయ్యారో చర్చించివుంటే బాగుండేది: రోజా
ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ... టీడీపీ మహానాడులో తీర్మానాలు పెట్టి వాటిపై చర్చిస్తోన్న నేతలు.. ఎన్టీఆర్ చివరి రోజుల్లో ఎలా మానసిక క్షోభకు గురయ్యారో కూడా చర్చించివుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌కు భారతరత్నను సాధించడంలోనూ టీడీపీ సరిగా ప్రయత్నాలు జరపడం లేదని దుయ్యబట్టారు. ఏపీలో చంద్రబాబు సర్కారు కనీసం ఒక్క పథకాన్నయినా సరిగా అమలు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటివరకు రాజధానిపై ఒక్క అడుగు ముందుకు పడలేదని రోజా అన్నారు. ఓ వైపు అవినీతిలో ఏపీ అగ్రస్థానంలో ఉందని ఎన్‌సీఈఆర్సీ సర్వే తేల్చితే, మరోవైపు అవినీతిరహిత పాలన చేస్తున్నామని ఏపీ సీఎం అసత్యాలు పలుకుతున్నారని ఆమె అన్నారు. కేవలం ఐదు నెలల్లో రాష్ట్ర మంత్రి లోకేశ్ ఆస్తులు 22 రెట్లు పెరిగాయని ఆమె ఆరోపించారు.