: 'దయ్యాల కొంప' వ్యాఖ్యలపై బహిరంగ క్షమాపణ చెప్పిన ఎంవీవీఎస్ మూర్తి
ఆంధ్రా యూనివర్శిటీని 'దెయ్యాల కొంప'గా అభివర్ణించి తీవ్ర విమర్శలు కొని తెచ్చుకున్న ఎమ్మెల్సీ ఎంవీవీఎస్ మూర్తి ఎట్టకేలకు మెట్టు దిగారు. విద్యార్థి సంఘాల నుంచి ప్రొఫెసర్లు, సాధారణ ప్రజలు, ఏయూ పూర్వ విద్యార్థుల వరకూ విమర్శలు ఎదుర్కొన్న ఆయన, కొద్దిసేపటి క్రితం విశాఖ మహానాడు వేదికపై బహిరంగ క్షమాపణలు చెప్పారు. నాటి తన వ్యాఖ్యలను అపార్థం చేసుకున్నారని, తన మాటలతో బాధపడిన వారందరికీ క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. వర్శిటీ గొప్పతనాన్ని కించపరచడం తన ఉద్దేశం కాదని చెప్పారు. ఆ వెంటనే చంద్రబాబు మాట్లాడుతూ, సమాజంలో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి అలా మాట్లాడటం సరికాదని తాను చెప్పగానే, మూర్తి క్షమాపణలు కోరడం ఆయన సంస్కారానికి నిదర్శనమని అన్నారు.