: ఇండియా సాగిస్తున్న రక్తపాతాన్ని ఆపండి: అంతర్జాతీయ సమాజానికి పాక్ వినతి


కశ్మీర్ లోయలో భారత్ సాగిస్తున్న అరాచకాలను, సృష్టిస్తున్న రక్తపాతాన్ని ఆపేందుకు ఇప్పటికైనా ముందుకు రావాలని అంతర్జాతీయ సమాజాన్ని, ఐక్యరాజ్య సమితిని పాక్ కోరింది. హిజ్బుల్ ముజాహిద్దీన్ ఉగ్రవాది, బుర్హాన్ వనీ వారసుడిగా చెప్పుకునే సబ్జార్ అహ్మద్ భట్ ఎన్ కౌంటర్ పై పాక్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సత్రాజ్ అజీజ్ స్పందిస్తూ, ఇది భారత సైన్యం దమనకాండకు నిదర్శనమని అన్నారు.

పుల్వామా, బారాముల్లా జిల్లాల్లో అమాయకులైన 12 మంది కశ్మీరీలను సైన్యం హతమార్చిందని ఆరోపించారు. ఐరాసతో పాటు ముస్లిం దేశాలు, పీ-5 సభ్యులు, మానవ హక్కుల సంఘాలు భారత్ చేయిస్తున్న హత్యలను తక్షణం నిలిపేలా ఒత్తిడి తేవాలని డిమాండ్ చేశారు. కాగా, రాష్ట్రీయ రైఫిల్స్, జేకేపీ, స్పెషల్ ఆపరేషన్ గ్రూప్, సీఆర్పీఎఫ్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన టెర్రరిస్ట్ హంట్ లో అహ్మద్ భట్ హతుడైన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News