: పథకాలు అన్నవి, కలరింగ్ కొత్తది!: హరికృష్ణ ఎద్దేవా
ప్రస్తుతం నడుస్తున్న ప్రజాకర్షక సంక్షేమ పథకాలన్నీ దివంగత మహానేత ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభించినవేనని ఆయన కుమారుడు హరికృష్ణ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ కు వచ్చి, తన తండ్రికి నివాళులు అర్పించిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వాలు పాత పథకాలకు కొత్త కలరింగ్ ఇచ్చి, వాటిని తమ పథకాలుగా చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ ను తెలుగు ప్రజలు ఎన్నటికీ మరువలేరని అన్నారు. ఆయన దూరమై ఇన్ని సంవత్సరాలు అయినా, ప్రజల మనసులో సుస్థిరంగా ఉన్నారని హరికృష్ణ చెప్పారు.