: రాబోయే జె-సిరీస్ స్మార్ట్‌ఫోన్లను పొరపాటున ఆన్‌లైన్‌లో లీక్ చేసిన శాంసంగ్!
సౌత్ కొరియా మొబైల్ మేకర్ శాంసంగ్ పొరపాటున రాబోయే జె సిరీస్ ఫోన్లు గెలాక్సీ జే 5(2017), గెలాక్సీ జే7 (2017)ల ను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. ఈ ఫోన్లకు సంబంధించి కంపెనీ ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయకపోయినా ఆన్‌లైన్‌లో ప్రత్యక్షం కావడం చర్చనీయాంశంగా మారింది. హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్‌ను ముంచెత్తుతున్న వేళ అందుబాటు ధరల్లో అన్ని ఫీచర్లు కలిగిన జె సిరీస్ ఫోన్లను శాంసంగ్ అందుబాటులోకి తెస్తోంది. శాంసంగ్ జె సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఆండ్రాయిడ్ గో ఆపరేటింగ్ సిస్టంను ఉపయోగిస్తున్నారు. కాగా, శాంసంగ్ మేలో గెలాక్సీ జే 3 (2017)ను విడుదల చేసింది.