: లంచమడిగిన సొమ్మును కలెక్టరుకు మనియార్డర్ చేసిన యువతి!


తన తండ్రి మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఇచ్చేందుకు ఓ అధికారి రూ. 2 వేలను లంచంగా ఇవ్వాలని అడిగిన వేళ, ఆ డబ్బును స్వయంగా కలెక్టరుకు మనియార్డర్ చేసిన యువతి కలకలం సృష్టించింది. తమిళనాడు విళుపురం జిల్లా ఆనత్తూరుకు చెందిన సుధ అనే యువతి, తన తండ్రి తొప్పయ్యన్‌ (55) మరణించగా, డెత్ సర్టిఫికెట్, కర్మ కాండల ఖర్చు కోసం ప్రభుత్వం ఇచ్చే సహాయం కోసం అధికారుల చుట్టూ సంవత్సరం పాటు తిరిగింది. లంచం ఇస్తేగాని పని కాదని అధికారులు తేల్చి చెప్పడంతో, ఆ లంచం డబ్బును కలెక్టరుకు మనియార్డర్ చేస్తూ, మీరే డబ్బు ఇవ్వాలని కోరింది. దీన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్, వెంటనే విచారణ జరపాలని స్థానిక అధికారులను ఆదేశించారు. వెంటనే యువతికి ధ్రువపత్రాలు, సాయం అందించాలని సూచించారు.

  • Loading...

More Telugu News