: 'ఈనాడు' కార్టూన్ ను చూసి మనసారా నవ్వుకున్న నరేంద్ర మోదీ!


నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం మూడేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనాడు దినపత్రికలో ప్రచురించి ఓ కార్టూన్ ను చూసిన ప్రధాని నరేంద్ర మోదీ మనసారా నవ్వుకున్నారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్వయంగా తెలుపుతూ, దీన్ని మోదీ ఎంతో ఇష్టపడ్డారని పేర్కొన్నారు. మూడవ వార్షికోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో ప్రత్యేక వేడుకలు జరుగగా, అక్కడికి మోదీ హాజరయ్యారు. ఈనాడులో ప్రచురితమైన కార్టూన్ ను 25 మీటర్ల ఎత్తున డిజిటల్ రూపంలో ప్రదర్శించగా, వెంకయ్యనాయుడు దీన్ని మోదీకి చూపించారు. కార్టూన్ ఇతివృత్తం మోదీకి ఎంతో నచ్చిందని, ఆయన స్వయంగా పత్రికను, కార్టూనిస్టును అభినందించారని వెంకయ్య తెలిపారు. ఆ కార్టూన్ ఇదే.

  • Loading...

More Telugu News