: చంద్రబాబును దించి బాలకృష్ణను ఎక్కించండి: తెలుగు తమ్ముళ్లకు రోజా సలహా
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబునాయుడు ఎంతమాత్రమూ పనికిరారని, ఆ పదవికి నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణను ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీకి వైకాపా ఎమ్మెల్యే రోజా సూచించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె, అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోనే అవినీతి సీఎంగా చంద్రబాబు మొదటి స్థానంలో ఉన్నారని విమర్శించారు. టీడీపీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబును రాజీనామా చేయించి, ఆ పదవిని బాలయ్యకు ఇస్తే, పార్టీకి మేలు చేకూరుతుందని జోస్యం చెప్పారు. గత మహానాడులో ఇచ్చిన హామీల్లో ఒక్కదాన్ని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని, కాపు సోదరుల రిజర్వేషన్ అంశంలో ఆయన నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు.