: వేడెక్కిన హెలికాప్టర్ ఇంజిన్.. గుజరాత్ సీఎం రూపానీ ప్రయాణిస్తున్న చాపర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్


గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ అహ్మదాబాద్ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం కలకలం రేపింది. అయితే ఇంజిన్ అధికంగా వేడి కావడం వల్లే హెలికాప్టర్‌ను ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వచ్చిందని ఎయిర్‌పోర్టు వర్గాలు తెలిపాయి. ఉమర్‌గామ్ నుంచి హిమ్మత్‌నగర్ వెళ్తుండగా హెలికాప్టర్ ఇంజిన్ వేడెక్కడం మొదలైందని, దీంతో సమీపంలో ఉన్న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో బలవంతంగా ల్యాండ్ చేయాల్సి వచ్చిందని విమానాశ్రయ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల క్రితం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News