: భద్రాచలంలోనూ తిరుమల తరహా నిబంధనలు


తెలంగాణలోని ప్రసిద్థ పుణ్యక్షేత్రం భద్రాచలంలో రాములవారి దర్శనానికి వెళ్లే వారికి తిరుమల తరహాలో డ్రస్ కోడ్ ను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. సంప్రదాయ దుస్తుల సంస్కృతిని ప్రవేశపెడుతున్నట్టు ఈఓ ప్రభాకర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ, పురుషులు పంచె, కండువా, స్త్రీలు చీర లేదా చుడీదార్ మాత్రమే ధరించి రావాలని అన్నారు. ప్రస్తుతానికి అంతరాలయంలో జరిగే పూజలు, ప్రత్యేక పూజలు, నిత్య కల్యాణం భక్తులకు ఈ నిబంధనలను వర్తింప చేయనున్నామని, భక్తుల స్పందనను బట్టి, ప్రత్యేక ప్రవేశ దర్శనానికీ ఇదే నిబంధన అమలు చేస్తామని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News