: తొలుత కేసీఆర్, ఆపై కేటీఆర్, హరీశ్ రావు... టీఆర్ఎస్ ఎమ్మెల్యేల ర్యాంకులివే!


ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే, తెలంగాణ రాష్ట్ర సమితికి 111 సీట్లు వస్తాయని, మిగతా అన్ని పార్టీలకూ కలిపి కేవలం 8 సీట్లు మాత్రమే వస్తాయని చెప్పిన సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేలకు ర్యాంకులు ప్రకటించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్న కేసీఆర్ 98 శాతం ప్రజాదరణతో తొలి స్థానంలో ఉండగా, ఆపై 91 శాతం ఆదరణతో సిరిసిల్ల ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్, 88 శాతం ఆదరణతో మరో మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ఉన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని పక్కన పెడితే, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే టీ రాజయ్య నాలుగో స్థానంలో నిలిచి 86 శాతం ప్రజాదరణను చూరగొన్నారు.

మిగతా వారిపై సర్వేలో వెల్లడైన ఆదరణను గమనిస్తే, ములుగు ఎమ్మెల్యేకు 57 శాతం, భూపాలపల్లిలో ఎమ్మెల్యేకు 71.6 శాతం, పరకాల ఎమ్మెల్యేకు 65 శాతం, మహబూబాబాద్ ఎమ్మెల్యేకు 54.8 శాతం, వర్ధన్నపేట ఎమ్మెల్యేకు 70.3 శాతం, వరంగల్ ఈస్ట్‌ ఎమ్మెల్యేకు 68.1శాతం, పాలకుర్తిలో ఎమ్మెల్యేకు 63 శాతం, డోర్నకల్‌ ఎమ్మెల్యేకు 60.6 శాతం, వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే కు 71.3 శాతం, జనగామ ఎమ్మెల్యేకు 51 శాతం అదరణ ఉందని తెలిపారు. తుంగతుర్తి ఎమ్మెల్యేకు 46 శాతం, ఆలేరు ఎమ్మెల్యేకు 54 శాతం ఆదరణ ఉందని కేసీఆర్ వెల్లడించారు. మిగతా ఎమ్మెల్యేల ర్యాంకులనూ ప్రకటించిన ఆయన, ఆదరణ తగ్గిన వారు పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తామన్న భరోసాను ఇస్తూనే, పనితీరు సక్రమంగా లేకుంటే వేటు వేసే ఆలోచన కూడా ఉందని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News