: మరో రాజకీయ హత్య... ప్రత్యర్థిపై యాసిడ్ పోసి ఆపై కత్తులతో దాడి


చిత్తూరు జిల్లాలో మరో రాజకీయ హత్య జరిగింది. కేవీబీ పురానికి చెందిన రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తిని ప్రత్యర్థులు అత్యంత పాశవికంగా హత్య చేశారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇంటికి వెళుతున్న ఆయన్ను చుట్టుముట్టిన కొందరు దుండగులు తొలుత యాసిడ్ పోసి, ఆపై కత్తులతో దాడికి దిగారు. విచక్షణారహితంగా పొడవడంతో ఆయన అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలుసుకున్న పుత్తూరు డీఎస్పీ, సీఐ ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. పాత కక్షల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ప్రాథమికంగా నిర్థారించిన వారు, హంతకులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని తెలిపారు. దుండగుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News