: తాతల వయసులో ఉండి షూటింగ్ బ్రేక్ లో రమ్మని పిలిచేవాళ్లు ఎందరో ఉన్నారు!: నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు
సీనియర్ నటుడు చలపతివారు మంచి వ్యక్తని వెనకేసుకొచ్చిన నటి అపూర్వ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంతో మంది తాతయ్యల వయసులో ఉన్న వారు అమ్మాయిలను పక్కన కూర్చో బెట్టుకుని, వాళ్ల మీద చేతులు వేసి కబుర్లు చెబుతూ, విరామ సమయంలో గదిలోకి రమ్మని ఆదేశించే వాళ్లు చాలా మందే ఉన్నారని చెప్పింది. వాళ్లతో పోల్చితే బాబాయ్ చలపతిరావు దేవుడి వంటి వాడని చెప్పింది. చలపతిరావు కష్టాల్లో ఉన్న వేళ, ఆయనంటే తెలియని వారు కూడా మంచిగా చెబుతుంటే, చుట్టు పక్కల ఉన్న వాళ్లు ముందుకొచ్చి, ఆయన మంచి మనసును గురించి చెప్పడం లేదెందుకని ఉద్వేగంగా ప్రశ్నించింది. చలపతిరావు గురించి కొంతమంది నోటికొచ్చినట్టు మాట్లాడుతున్న వేళ, ఆయన మంచి మనసు ఎట్లాంటిదో కొంతమందైనా బయటకు వచ్చి చెబితే బాగుంటుందని సలహా ఇచ్చింది.