: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన 'సాయి సర్వం' ట్రావెల్స్ బస్సు.. ఒకరి మృతి


ఆగివున్న ఓ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టిన ఘటన ఈ తెల్లవారుజామున జరిగింది. విశాఖపట్టణం నుంచి విజయవాడ వెళ్తున్న 'సాయి సర్వం' ట్రావెల్స్‌ బస్సు పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఆలంపురం గ్రామ సమీపంలో ఈ ప్రమాదానికి గురైంది. వేగంగా వస్తున్న బస్సు బలంగా లారీని తాకడంతో, బస్సులో ప్రయాణిస్తున్న వారిలో ఒకరు మరణించగా, మరో ఆరుుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సహకారంతో గాయపడిన వారిని ఆసుపత్రులకు తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్య వర్గాలు వెల్లడించాయి.

  • Loading...

More Telugu News