: తాతయ్యకు నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్!


తన తాతయ్య, దివంగత నందమూరి తారకరామారావు జయంతి వేడుకల వేళ, హైదరాబాదు, నెక్లెస్ రోడ్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వచ్చి నివాళులు అర్పించిన జూనియర్ ఎన్టీఆర్, తెలుగు ప్రజలకు ఆయన ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని వ్యాఖ్యానించాడు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఆయన నిలిచిపోయారని, ఆ స్థానం మరెవ్వరికీ దక్కదని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో పాటు పలువురు ఎన్టీఆర్ అభిమానులు, టీడీపీ కార్యకర్తలు ఆయన స్మారక చిహ్నం వద్దకు వచ్చి నివాళులు అర్పిస్తున్నారు. పలువురు సినీ సెలబ్రిటీలు, ప్రముఖులు వస్తుండటంతో ఘాట్ వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News