: కొవ్వుతోనో, కామంతోనో చలపతి బాబాయ్ అలా అనలేదు: నటి అపూర్వ


ఇటీవల ఓ సినిమా ఫంక్షన్ లో సీనియర్ నటుడు చలపతిరావు ఆడవాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు తప్పేనని, అయితే, ఆయన కొవ్వుతోనో, కామంతోనో అలా అనలేదని నటి అపూర్వ అభిప్రాయపడింది. ఆ రోజున కార్యక్రమం యాంకర్ కూడా ఆడపిల్లేనని, ఆ ప్రశ్న అడగాల్సినంత అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించిన అపూర్వ, ఎప్పుడూ సరదాగా, ఫన్నీగా మాట్లాడుతూ ఉండే చలపతిరావు వద్దకు మైక్ పట్టుకుని ఆమె వెళ్తుంటేనే, బాబాయ్ ఏమనేస్తారో? అని భయపడ్డానని, టప్ మని ఆయన అనేశారని, అది నోరు జారి చేసిన వ్యాఖ్యేనని చెప్పుకొచ్చింది.

ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా ఆయన చాలా మంచివాడని చెబుతారని, చలపతిరావు తమకు దేవుడని ఉద్వేగంతో చెప్పుకొచ్చింది. చలపతిరావును బాయ్ కాట్ చేయాలని, ఇండస్ట్రీ నుంచి తరిమేయాలని అనడం తగదని, ఆయనేమీ ఉగ్రవాది కాదని చెప్పింది. తనతో సహా, ఇండస్ట్రీలోని అందరితో ఆయనెంతో సరదాగా ఉంటారని, ఎవరితోనూ ఒక్కసారి కూడా మిస్ బిహేవ్ చేయలేదని వెల్లడించింది. 'ఆత్మహత్యాయత్నం చేసిన చలపతిరావు' అంటూ వచ్చిన ఫేక్ న్యూస్ విని తన కళ్లలో నీళ్లు వచ్చాయని అపూర్వ చెప్పింది.

  • Loading...

More Telugu News