: జే & కేలో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత!


జమ్మూకశ్మీర్ (జే & కే) లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. హిజ్బుల్ ముజాహిదీన్ కు చెందిన ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను ఎన్ కౌంటర్ చేసిన నేపథ్యంలో ఇంటర్నెట్ సేవలు నిలిపేస్తున్నట్టు టెలికాం సంస్థలు ప్రకటించాయి. గతంలో ఇదే ఉగ్రవాద సంస్థకు చెందిన బుర్హాన్ వనీని ఎన్ కౌంటర్ చేసిన సమయంలో తీవ్ర ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ప్రజలు రోడ్లపైకి వచ్చి, రాళ్లు విసరడం ప్రారంభించిన సంగతి విదితమే.

ఈ రోజు హతమైన సబ్జార్ అహ్మద్ పలు సందర్భాల్లో సైన్యానికి సోషల్ మీడియాలో సవాళ్లు విసిరాడు. పాపం పండడంతో ఎన్ కౌంటర్ కు గురయ్యాడు. ఈ నేపథ్యంలో వాట్స్ యాప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ఎలాంటి పుకార్లు చెలరేగి అల్లర్లు చోటుచేసుకోకుండా ఉండేందుకు అంతర్జాల సేవలను నిలిపేశారు. పునరుద్ధరణపై ఎలాంటి ప్రకటన విడుదల కాకపోవడం విశేషం. రంజాన్ మాసం కావడంతో ప్రార్థనల పేరుతో ఉగ్రవాదులు కలుసుకునే అవకాశం ఉందని భావించిన భద్రతా బలగాలు పహారా కాస్తున్నాయి. 

  • Loading...

More Telugu News